- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు! బెంగళూరు క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి యువతి ఫిదా.. వీడియో వైరల్
కర్ణాటకలోని బెంగళూరులో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో ఘర్షణలకు దారి తీసే ఘటనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటకలోని బెంగళూరులో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో ఘర్షణలకు దారి తీసే ఘటనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ చూపిన మానవత్వం ప్రస్తుతం సోషల్ మీడియాలో హృదయాలను కదిలిస్తోంది. ఈ మేరకు ఓ యువతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ముంబయికి చెందిన ఓ యువతి బెంగళూరులో క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా, ఫోన్‌లో తన స్నేహితురాలితో మాట్లాడుతూ, ‘నాకు ఎంత ఆకలిగా ఉంది.. రాత్రి 2 గంటలకు ఫ్లైట్ ఉంది… ఇప్పుడేం తింటానో?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలు విన్న క్యాబ్ డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుకి పక్కన ఆపాడు.కొన్ని నిమిషాల్లో శాండ్‌విచ్‌తో తిరిగి వచ్చి ఆమెకు ఇచ్చాడు. డ్రైవర్ మృదువుగా, ‘నా అక్క ఆకలితో ఉంటే నాకు ఎలా అనిపిస్తుందో.. అదే భావంతో తీసుకువచ్చాను’ అని ఆమెకు సమాధానం చెప్పాడు.
దీంతో ఆ డ్రైవర్ చూపించిన ప్రేమ, అనురాగానికి యువతి కళ్లలో నీళ్లు ఆగలేదు. ఈ మంచితనాన్ని నేను జీవితాంతం మరచిపోలేను.. అంటూ హృదయపూర్వకంగా డ్రైవర్‌కు ధన్యవాదాలు తెలిపినట్లు స్టోరిని నెటిజన్‌లతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్రైవర్ చూపించిన చొరవకు నెటిజన్‌లు ఫిదా అయ్యారు. కరుణ చూపడానికి భాష అవసరం లేదని, మంచి హృదయం ఉంటే చాలని క్యాబ్ డ్రైవర్ తీరుతో వ్యక్తం అవుతుందని, భారత్ అంటే ఇదేనని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. ఇది అసలైన భారతదేశం అని నెటిజన్‌లు కామెంట్ల రూపంలో తెలియజేశారు. యువతి మాటలు విని.. తన మనసు గెలిచాడని మరో నెటిజన్ కామెంట్ చేశారు. వీడియో ఇదే..






