- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో? వీధి కుక్క దాడి నుంచి తప్పించుకోబోయి.. మరో చిక్కులో!
ప్రస్తుత రోజుల్లో వీధి కుక్కల భయం సామాన్యులను వెంటాడుతోంది. రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఒక యువకుడు వీధి కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అనే సామెతను గుర్తు చేస్తుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుత రోజుల్లో వీధి కుక్కల భయం సామాన్యులను వెంటాడుతోంది. రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఒక యువకుడు వీధి కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అనే సామెతను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన తెగ వైరల్ అవుతుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక గల్లీలో వెళ్తున్న ఒక యువకుడిని ఓ వీధి కుక్క ఒక్కసారిగా వెంటాడింది. దాని నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ యువకుడు తన శక్తి కొద్దీ పరిగెత్తాడు. చివరకు దారిలో ఉన్న ఒక ఇంటి గేటును రక్షణ కవచంగా భావించి, అత్యంత వేగంతో దానిపై నుంచి లోపలికి దూకాడు. ఇక కుక్క నుంచి తప్పించుకున్నానని ఊపిరి పీల్చుకునేలోపే అతడికి ఊహించని షాక్ తగిలింది.
గేటు లోపల మరో గండం!
బయట ఉన్న కుక్క నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లిన ఆ యువకుడికి, అక్కడ మరో మూడు పెంపుడు కుక్కలు స్వాగతం పలికాయి. ఒక వైపు వీధి కుక్క, మరోవైపు ఇంట్లోని పెంపుడు కుక్కలు.. ఆ యువకుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బయట ఉన్న కుక్క కంటే లోపల ఉన్న కుక్కలే సంఖ్యలో ఎక్కువగా ఉండటంతో ఆ యువకుడు ఒక్క క్షణం షాక్ అయ్యాడు. వెంటనే ఆ యువకుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. పెంపుడు కుక్కలు తనపై దాడి చేసేలోపే, మళ్ళీ అదే వేగంతో గేటు దూకి బయటకు పారిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బయట ఉన్న వీధి కుక్క దూరంగా వెళ్లడంతో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ యువకుడి పరిస్థితి చూసి "నిజంగానే ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో?" అని కామెంట్స్ చేస్తున్నారు.






