- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టూ వీలర్స్ పై టోల్.. గడ్కరీ మాట తప్పారంటూ ఫైర్.. అసలు విషయం ఏంటంటే..
టూ వీలర్స్ వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఓ యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: టోల్ ప్లాజాల వద్ద ఇకపై టోల్ ఫీజు ఉండదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది ప్రకటన వరకు మాత్రమే పరిమితమైందని, నిజానికి అది అమలు కావట్లేదంటూ ఓ నెటిజన్ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో టూ వీలర్ల వద్ద టోల్ ఫీజు రూ.70 వసూలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోనే ఇది జరుగుతుందని యూజర్ పేర్కొన్నారు. అయితే.. అక్కడ టోల్ ఫీజు వసూలు చేస్తున్న మాట వాస్తమేనని, కానీ అది కేంద్రానికి సంబంధించిన టోల్ ప్లాజా కాదని ఓ యూజర్ కామెంట్ చేశారు.
"ఈ వీడియో యమునా ఎక్స్‌ప్రెస్ కి సంబంధించినది, అక్కడ వారు బైక్‌లపై పన్ను వసూలు చేస్తారు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంది కాదు. ఒక కంపెనీ ఎక్స్‌ప్రెస్." అని తెలిపాడు.
అయితే ఆ కంపెనీ భూమిని కొన్నదా లేక ప్రభుత్వం సంపాదించిందా? అని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. "యమునా అథారిటీ దానిని స్వాధీనం చేసుకుంది, ఏదో ఒక కంపెనీ రైతు నుండి నేరుగా తీసుకుంది" అని నెటిజన్ బదులిచ్చాడు. మరో యూజర్ ఇదేదో పెద్ద స్కామ్ లాగా ఉందని, ఎవరో ఒకరు వచ్చి రైతు నుండి నేరుగా భూమిని కొనుగోలు చేసి హైవే నిర్మించి టోల్ వసూలు చేస్తుంటే.. ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ హైవేలో మా ఊరి భూమి పోయింది. గ్రేటర్ నోయిడా అథారిటీ నేరుగా జేపీ ఇన్‌ఫ్రాకు భూమిని అందించింది అని మరో యూజర్ తెలిపారు. సో.. అక్కడ టోల్ వసూలు చేస్తున్నది కేంద్రం కాదని యూజర్ల కామెంట్ల ద్వారా తెలుస్తోంది.






