Yacón: ఓరి నీ దుంప తెగ! పాదం ఆకారంలో ఉన్న అరుదైన దుంపలు.. వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-05-01 12:01:37  IST  )

ఈ మధ్య కొంతమంది వింతైన ఆకృతుల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ముఖ్యంగా భూమిలో పెరిగే దుంపలు వెరైటీ ఆకృతుల్లో పండుతాయి.

Yacón: ఓరి నీ దుంప తెగ! పాదం ఆకారంలో ఉన్న అరుదైన దుంపలు.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral on social media) ఈ మధ్య కొంతమంది వింతైన ఆకృతుల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. ముఖ్యంగా భూమిలో పెరిగే దుంపలు (Tuber) వెరైటీ ఆకృతుల్లో పండుతాయి. చామగడ్డ, ఆలుగడ్డ, కంద, కర్రపెండలం దుంపలు చూసే ఉంటారు. అన్నీ కూడా దాదాపు గుండ్రంగా, పొడవుగా, కొన్ని ఆకారం లేకుండా ఉంటాయి. అయితే, కొన్ని మాత్రం చేతివేళ్లలా ఉంటే మరికొన్ని కాలివేళల్లా ఉంటాయి. ఇలాంటి వింతైన ఆకృతుల దుంపలను కనుగొన్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో చూపించిన ప్రకారం.. నల్ల రేగడి భూమిలో మనిషి పాదం ఆకారంలో ఉన్న దంపను వ్యక్తి బయటకు తీస్తాడు. దానికి వేర్లు సైతం ఉంటాయి. అచ్చం పొలం పనులతో మట్టితో ఉన్న మనిషి పాదం మాదిరి ఆ దుంప ఆకృతిని ఆ వ్యక్తి వివరిస్తున్నాడు. ఇది అరుదైన, వింతైన యాకోన్ అని చెబుతున్నాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. కట్ అయిన మనిషి పాదం అనుకోని భయపడ్డాం కదరా.. ఓరి నీ దుంప తెగ అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.

గతంలోనూ తెలంగాణలో ఇలాంటి ఆకారం కలిగిన దుంపలు రైతులు పండిస్తున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి, భీమిని మండలాల్లో రతాలం అనే దుంపలను దశాబ్దాలుగా సంప్రదాయ పంటగా సాగు చేస్తున్నారు. ఏ రెండు రతాలం దుంపలు ఒకేలా ఉండవు, చేతివేళ్లు, కాలివేళ్లు మాదిరిగా ఉంటాయి. దీంతో ఆలుగడ్డల మాదిరి కూరలు చేయడం, లేదా శివరాత్రి, ఏకాదశి లాంటి పర్వదినాల్లో ఉపవాస దీక్షలు పాటించే వారు ఈ ముక్కలను అల్పాహారంగా తీసుకుంటారు. కాగా, యకోన్ (Yacón) కూడా దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సంప్రదాయ పంట. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని, రుచి కూడా తియ్యగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story