- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: అసలు మనిషివేనా..? లిఫ్ట్‌లో కుక్కపిల్లను కొట్టి చంపిన పని మనిషి.. వీడియో వైరల్
బెంగళూరులో మానవత్వం మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో:బెంగళూరులో మానవత్వం మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. ఓ పని మనిషి కుక్కపిల్లను లిఫ్ట్‌లో దారుణం చంపిన ఘటన సీసీటీవీ కెమెరాలో బహిర్గతమైంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న పనిమనిషిపై ఇంటి యజమాని నమ్మకం ఉంచి పెంపుడు కుక్క పిల్లను సంరక్షించమని బాధ్యత అప్పగించారు. అయితే ఆమె ఆ నమ్మకాన్ని మోసం చేస్తూ, కుక్కపిల్లను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి అతి క్రూరంగా నెలకేసి ఒక్క దెబ్బకు కొట్టి చంపింది. అనంతరం ఏమీ జరగనట్లు ప్రవర్తించిన ఆమె లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూసి అందరూ షాక్ అయ్యారు.
ఈ ఘటనపై అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంపుడు జంతువుపై జాలి లేకుండా కొట్టి చంపినందుకు కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కుక్కపిల్ల యజమాని రాశి పుజారీ పనిమనిషి పుష్పలత పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అక్టోబర్ 31 మధ్యాహ్నం జరిగింది. గూఫీ అనే పెంపుడు కుక్కపిల్లను పనిమనిషి పుష్పలత దారుణంగా కొట్టి చంపినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాగలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఇక, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు పనిమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కుక్కపిల్లను అంత కౄరంగా చంపడానికి మనసు ఎలా వచ్చింది.. నువ్వు అసలు మనిషివేనా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. వీడియో ఇదే..






