- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: నూకలున్నాయి.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు వచ్చిన సింహం.. ఏమి చేసిందంటే?
అడువుల్లో ఉండాల్సిన మృగాలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో జనావాసాల్లో తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చాలా ఉన్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral Video) అడువుల్లో ఉండాల్సిన మృగాలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో జనావాసాల్లో తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో చిరుతలు, ఇతర అడవి మృగాల బెడద ఎక్కువగా ఉంటుంది. పొలాల్లో పనిచేసే మనుషులపై అప్పుడప్పుడు ఎటాక్ చేయడం.. గ్రామాల్లో సాధు, పెంపుడు జంతువులపై దాడి చేసి చంపడం చేస్తుండటంతో అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. అయితే తాజాగా ఓ సింహాం (Lion on the road) రోడ్డుపై సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. భారత్‌లోనే ఈ ఘటన జరిగనట్లుగా చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు.
వీడియోలో చూపించిన ప్రకారం.. ఒక పట్టణ ప్రాంతంలా కనిపించే ప్రదేశంలో ఓ సింహం గల్లీల్లో తిరుగుతుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ వ్యక్తి పక్క నుంచి వెళ్ళింది. కాసేపటి తర్వాత నిద్రించే వ్యక్తి వద్దకు సింహం వచ్చి వాసన (స్మెల్) చూసి అతడిని వదిలేసి వెళ్లిపోతుంది. ఆ సమయంలో వ్యక్తి కదిలినట్లుగా కన్పిస్తాడు. కానీ వ్యక్తి మాత్రం గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సింహం అతడిని చూసి కూడా దాడి చేయకుండా అతడిని వదిలి వెళ్లిపోవడంతో నెట్టింట వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెట్టారు.
ఇది ఫేక్ వీడియో అని, ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) ఆధారంతో క్రియేట్ చేసి ఉంటారని నెటిజన్లు నిర్ధారించారు. మరోవైపు కొందరు నెటిజన్లు ఆందోళనకు గురయ్యారు. గుజరాత్ లాంటి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు సింహాలు అలాగే రోడ్లపై తిరుగుతాయని కొందరు కామెంట్స్ పెట్టారు. వామ్మో.. భూమిపై నీకు నూకలున్నాయి బ్రదర్.. అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. సింహం అతడి స్మెల్ చూసి.. టేస్ట్ బాగాలేదని వదిలేసి ఉండొచ్చని కొంత మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.






