కూలిపోయిన యుద్ధ విమానం.. ఎత్తిన హెలికాప్టర్! భారత్-పాక్ ఉద్రిక్తల వేళ మరో వీడియో వైరల్

by Ramesh Naini |

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

కూలిపోయిన యుద్ధ విమానం.. ఎత్తిన హెలికాప్టర్! భారత్-పాక్ ఉద్రిక్తల వేళ మరో వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాకిస్తాన్ (India-Pakistan) ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొంత మంది నెటిజన్లు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారు. గతంలో పాలస్తీనా, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన వార్ వీడియోలు, ఏఐ జనరేటెడ్, వార్ వీడియో గేమ్ లాంటి వీడియోలను భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా క్రాష్ అయిన ఫైటర్ జెట్‌ను ఎత్తిన హెలికాప్టర్ వీడియో కలకలం సృష్టించింది. వాట్సప్‌ గ్రూపుల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో చూపించిన ప్రకారం.. ఒక హెలికాప్టర్ చెట్ల మధ్యలో కూలిపోయిన ఫైటర్ జెట్‌ను ఎత్తుతున్నట్లు కనిపిస్తోంది. అత్యవసర సిబ్బంది నేలపై ఉన్నారు. పాకిస్తాన్ కు భారత్ నుంచి ఇలా దారుణంగా దెబ్బ తగిలిందని, అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం బయటకు వస్తున్నట్లు కనిపిస్తోందని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఏఐ జెనరేట్ వీడియోగా భావిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయవద్దని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

కాగా, (Fake Alert) భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఫేక్ వీడియోలు, ఫోటోలపై ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే పీబీ (ప్రెస్ ఇన్ఫర్మెషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్‌కు చేరవేయాలని ప్రభుత్వం పౌరులను కోరింది. దీని కోసం +918799711259 నంబర్‌కు వాట్సాప్ ద్వారా, [email protected] వెబ్‌సైట్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయోచ్చని పేర్కొంది. అలాగే ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తప్పుడు సమాచారానికి బలికావొద్దని, అధికార వర్గాల సోర్స్‌ని మాత్రమే ధ్రువీకరించుకోవాలని తెలిపారు.

Next Story