- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Goat: అక్కడికెలా ఎక్కావే! కరెంట్ తీగలపై మేతకెళ్లిన మేక.. అది చూసిన నెటిజన్లు షాక్ (వీడియో)
కరెంట్ తీగ (current wires) పైకి ఎలా ఎక్కిందో గానీ మేక చేసిన విన్యాసాలు చూసి మాత్రం నెటిజన్లు షాకింగ్‌కు గురయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కరెంట్ తీగ (current wires) పైకి ఎలా ఎక్కిందో గానీ మేక చేసిన విన్యాసాలు చూసి మాత్రం నెటిజన్లు షాకింగ్‌కు గురయ్యారు. సాధారణంగా మేకలు (Goat) చెట్ల పైకి ఎక్కడం, నెల పై ఉండే గడ్డిని మేయడం చేస్తుంటాయి. అదేవిధంగా అడవి మేకలు అయితే గుట్టలు, కొండలు ఎక్కి మేత మేస్తాయి. అడవి మేకలు ఎంతటి పెద్ద పర్వతాలనైన ఎక్కి తన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అయితే ఇక్కడ ఓ మేక ఆహారం కోసం ఏకంగా కరెంట్ తీగలపై సర్కస్ చేస్తున్న మాదిరి హ్యాపీగా మేత తింటోంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో చూపించిన ప్రకారం.. ఒక తెల్ల మేక ఎలక్ట్రిక్ వైర్లపై ఎక్కి తీగలకు అంటుకోని ఉన్న గడ్డిని మేస్తోంది. మేక వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. వామ్మో.. కరెంట్ తీగలపైకి ఎలా ఎక్కావే అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. చెట్లు, పర్వాతాలు, గుట్టలపైకి ఎక్కిన మేకలను చూశాము.. కానీ ఇలాంటి మేకలను చూడలేదు.. నిజంగా రియల్ లైఫ్ గోట్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది. మేక కరెంటు వైర్లపై ఉన్నప్పుడు పవర్ లేకపోచ్చని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో జరిగిందని మరో యూజర్ కామెంట్ పెట్టారు. అయితే ఇది ఫేక్ వీడియో అని, ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అని కొంత మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






