- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. పూరీ క్షేత్రంలో ఊహించని ఘటన.. దేనికి సంకేతం!
ఒడిషాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిషాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి (Puri Jagannath temple) ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం పూరీ ఆలయ శిఖరంపై ఉన్న (Neela Chakra) నీలచక్రంపైన ఎగిరే పతిత పావన జెండాను పట్టుకెళ్లి ఓ గద్ద ఆకాశంలో చక్కర్లు కొట్టింది. పూరీకి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం చేసుకుని మొక్కడం ఆనవాయితీ అని అందరికీ తెలిసిందే. అంత పవిత్రమైన పతితపావన జెండాను ఎన్నడూ లేనివిధంగా పక్షి లాక్కెళ్లడంతో భక్తులు వింతగా చూశారు. గద్ద జెండాను ఎత్తుకెళ్లడమే కాకుండా ఆలయం చుట్టూ రెండు స్లార్లు జెండాతో చక్కర్లు కొట్టింది. ఈ విశేష దృశ్యం భక్తులను అబ్బురపరిచింది. భక్తులందరూ ఇదేలా సాధ్యం అన్నట్లుగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పూరీ జగన్నాథుడి జెండాకు ప్రత్యేకత ఎంతో ఉంది. ఆ జగన్నాథుని దర్శనానికి కంటే ముందుగా, భక్తులు ఆలయ శిఖరంపై ఎగురుతున్న జెండాను చూసి ఆ పతాకానికి నమస్కరించడం ఆనవాయితీ. ఆలయంలో ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు ప్రస్తుత జెండాను తీసేసి, భక్తులు సమర్పించిన కొత్త జెండాను అర్చకులు ఎగురవేస్తారు. జెండాను ఎన్నడూ లేనివిధంగా గద్ద లాక్కెళ్లడం చర్చానీయాంశంగా మారింది. కొంత మంది భక్తులు ఇది అపచారంగా భావిస్తే మరికొంత మంది దివ్య సంకేతంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు షేర్ చేస్తున్నారు.






