ఇలా ఉన్నావేంట్రా.. లాగు ఊడి పోనీ.. గురి లక్ష్యం పైననే! పిల్లాడి గేమ్‌కు నెటిజన్లు ఫిదా

by Ramesh Naini |

ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఫోన్‌లు పట్టకోని బీజీగా మారారు.

ఇలా ఉన్నావేంట్రా.. లాగు ఊడి పోనీ.. గురి లక్ష్యం పైననే! పిల్లాడి గేమ్‌కు నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఫోన్‌లు పట్టకోని బీజీగా మారారు. చాలా మంది యువత, పిల్లలు ప్లే గ్రౌండ్ లో గేమ్స్ ఆడటం బంద్ పెట్టి.. వీడియో గేమ్స్, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. కానీ అందుకు భిన్నంగా ఓ పిల్లవాడు గ్రౌండ్ ఆడిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా నెట్టింట ఇద్దరు పిల్లలు ప్లే గ్రౌండ్‌లో షటిల్ గేమ్ ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ పిల్లాడు తను వేసుకున్న లాగు (నిక్కర్) ఊడిపోతున్న కూడా.. అది సరిచేసుకోకుండా ఫోకస్ గేమ్‌పైనే పెట్టి ఆడటం అందరినీ ఆకర్షించింది.

ఎక్స్‌లో సిద్దిపేట పోరడు అనే యూజర్ వీడియో పోస్ట్ చేస్తూ.. లాగు ఊడి పోనీ.. ప్రపంచం మునిగిపోనీ.. గురి లక్ష్యం పైననే. లాగు ఊడిపోతే మళ్ళీ తొడుక్కోవచ్చు. కానీ బాల్ మిస్ అయితే గేమ్ ఓడిపోతాము కదా! అందుకే లక్ష్యం లాగు మీద కాదు.. బాల్ మీద.. అంటూ నెటిజన్ రాసుకొచ్చారు. గేమ్ ఆడితే ఏది పట్టించుకోవా? ఇలా ఉన్నావేంట్రా బాబు.. అంటూ వీడియో చూసిన వారు ఫన్నీ కామెంట్స్ ఇస్తున్నారు.

Next Story