Viral video: వీడేంట్రా ఇలా ఉన్నాడు.. బహుబలిని మించిపోయాడుగా..!

by Yella Dhawani Reddy |

రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బహుబలి (Bahubali) మూవీ అందరికి గుర్తుంది కదా.

Viral video: వీడేంట్రా ఇలా ఉన్నాడు.. బహుబలిని మించిపోయాడుగా..!
X

దిశ, వెబ్ డెస్క్: రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బహుబలి (Bahubali) మూవీ అందరికి గుర్తుంది కదా. ఇందులో హీరో ప్రభాస్ (Prabhas) శివ లింగాన్ని భుజంపై ఎత్తుకెళ్లి జలపాతం వద్ద పెట్టే సీన్‌కు అయితే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సినిమాలో కాబట్టి అదంతా సాధ్యమైంది.. నిజ జీవితంలో అలా చేయాలంటే వామ్మో అంటారంతా. కానీ, ఓ వ్యక్తి తన నిజ జీవితంలో బహుబలి మూవీలోని సీన్‌నే రీక్రియేట్ చేశాడు. అయితే, అతడు భుజంపై మోసుకెళ్లింది శివలింగాన్ని కాదు. మరీ ఇంకా దేన్ని అనుకుంటున్నారా? చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోక మానరు. ఇంతకీ విషయం ఏమిటంటే?

రైల్వే క్రాసింగ్ (Railway Crossing) గురించి అందరికి తెలిసిందే. రోడ్డు మార్గం, రైల్వే మార్గం కలుసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో గేటు ఏర్పాటు చేసి.. రైలు వచ్చే సమయాల్లో రోడ్డు మార్గాన్ని మూసివేస్తుంటారు. రైల్వే క్రాసింగ్ పడినప్పుడు గేటు ఓపెన్ చేసే వరకు అక్కడ వాహనదారులు వేచి ఉండక తప్పదు. అయితే, రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండటం ఇష్టం లేని ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను అతడి భుజంపై ఎత్తుకుని గేటును క్రాస్ చేశాడు. ఇది చూసిన అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రియల్ బహుబలి అంటూ.. వీడేంట్రా ఇలా ఉన్నాడు అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే, సడెన్‌గా ట్రైన్ వస్తే పరిస్థితి ఏంటని, ఇలాంటి సాహసాలు చేయటం ప్రమాదకమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియలేదు.

Next Story