- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VC. Sajjanar: ఇవేం పిచ్చిపనులు.. వైరల్ వీడియోపై సజ్జనార్ ఫైర్
సోషల్ మీడియాలో లైకుల కోసం వ్యూవ్స్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో లైకుల కోసం వ్యూవ్స్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర స్థాయిలో రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఛాలెంజ్‌ల గురించి కూడా తెలిసిందే. ఒక పని చేసి దాన్ని ఇతరులు కూడా చేయాలని ఛాలెంజ్‌లు విసురుతుంటారు. తాజాగా ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేస్తూ ఛాలెంజ్ విసరగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి 5 లీటర్ల పెట్రోల్ బాటిల్ తీసుకుని రెండు చేతులు వదిలేసి డబ్బా మూత తీసి ట్యాంక్‌లో పెట్రోల్ పోశాడు. బైక్ 40 స్పీడ్ వెళుతున్నట్టు చూపించాడు.
ఈ స్టంట్ చేసింది కూడా సింగిల్ రోడ్ పై కాస్త తేడా వచ్చిందంటే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. దీంతో వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు.. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి అంటూ మండిపడ్డారు. దీంతో ఆ యువకుడిని అరెస్ట్ చేయాలి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






