- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాడి వల్ల నా జీవితం నాశనం అయ్యింది..త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..అఘోరీకి వర్షిణి మాస్ వార్నింగ్
అఘోరీ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. కొన్ని నెలలుగా ఏపీలో తెలంగాణలో ఆలయాలను సందర్శిస్తూ తాను లేడీ అఘోరీ అని చెప్పుకుని శ్రీనివాస్ ఎంతో మందిని మోసం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అఘోరీ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. కొన్ని నెలలుగా ఏపీలో తెలంగాణలో ఆలయాలను సందర్శిస్తూ తాను లేడీ అఘోరీ అని చెప్పుకుని శ్రీనివాస్ ఎంతో మందిని మోసం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీనివాస్ జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చాడు. జైలుకు వెళ్లే ముందు వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకోగా ఆ తరవాత అనేక కేసుల్లో నేరం రుజువై శ్రీనివాస్ జైలు పాలయ్యాడు. అయితే శ్రీనివాస్ జైలు నుండి బయటకు వచ్చిన తరవాత అతడి నుండి దూరంగా ఉంటున్న వర్షిణి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
అఘోరీ శ్రీనివాస్ గురించి అన్ని విషయాలు తెలిసిన తరవాతనే వదిలేశానని చెప్పింది. శ్రీనివాస్ వల్ల తన జీవితాన్ని కోల్పోయానని తన పరువు మొత్తం పోయిందని చెప్పింది. తన తల్లి దండ్రుల ముందు తల ఎత్తుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పై తన గురించి మాట్లాడవద్దని, చెడుగా అస్సలు మాట్లాడవద్దని హెచ్చరించింది. తనను కాంటాక్ట్ అయ్యేందుకు కూడా ప్రయత్నించవద్దని వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే అఘోరీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని హెచ్చరించింది.






