- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వందేభారత్ స్లీపర్‌లో అంతా చెత్త.. సివిక్ సెన్స్ లేదని మండిపడుతున్న నెటిజన్లు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈనెల 17న హౌరా - గువాహటి మధ్య తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించారు. కానీ.. ఈ ట్రైన్ లో ఎక్కడ చూసినా చెత్తే కనిపించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈనెల 17న హౌరా - గువాహటి మధ్య తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించారు. కానీ.. ఈ ట్రైన్ లో ఎక్కడ చూసినా తిని పడేసిన ఐస్ క్రీమ్ కప్పులు, తాగి వదిలేసిన వాటర్ బాటిళ్లు, చేతులు తుడుచుకున్న టిష్యూ పేపర్లతో నిండిన చెత్తే కనిపించింది. ఇందుకు కారణం ప్రభుత్వం కాదు.. ప్రయాణికులే. వందలకోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించినా వాటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నామని, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నామంటూ ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొత్తరైలులో అన్ని సౌకర్యాలనూ కల్పించినా, ఎక్కడికక్కడే డస్ట్ బిన్లు ఏర్పాటు చేసినా వాటిని వినియోగించుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా, కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారని వాపోయాడు. సీటు నుంచి లేచి డస్ట్ బిన్ వద్దకు వెళ్లేందుకు చాలా బద్దకించారని ఫైరయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. మనకు అస్సలు సివిక్ సెన్స్ లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని మనమే నీట్ గా ఉంచుకోవాలన్న కనీస అవగాహన లేకపోవడం బాధాకరమైన విషయమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






