వరదల బీభత్సం.. ఎక్కడికక్కడ తెగిన రోడ్లు.. ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేందుకు హెలికాప్టర్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. గ్రామాలను ముంచేసిన వరదలు.. రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినేందుకు కారణమయ్యాయి. ఇప్పటికే అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య రాజస్థాన్‌కు చెందిన నలుగువు బీఎడ్ విద్యార్థులు ఉత్తరాఖండ్‌లో పరీక్షా

వరదల బీభత్సం..  ఎక్కడికక్కడ తెగిన రోడ్లు.. ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేందుకు హెలికాప్టర్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. గ్రామాలను ముంచేసిన వరదలు.. రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినేందుకు కారణమయ్యాయి. ఇప్పటికే అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య రాజస్థాన్‌కు చెందిన నలుగువు బీఎడ్ విద్యార్థులు ఉత్తరాఖండ్‌లో పరీక్షా కేంద్రానికి చేరుకోవడం దాదాపు అసాధ్యమే. కానీ హెలికాప్టర్ బుక్ చేసుకుని మరీ పరీక్షకు హాజకయ్యారు. రాజస్థాన్‌లోని బాలోత్రకు చెందిన ఒమరామ్ జాట్, ప్రకాశ్ గోదారా జాట్, నర్పత్ కుమార్, మంగరామ్ జాట్.. ఉత్తరఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లా మున్సియారిలోని ఆర్ఎస్ టోలియా పీజీ కాలేజీలో బీఎడ్ ఎగ్జామ్ రాయాల్సి ఉండగా ఈ సాహసం చేశారు.

ఆగస్టు 31న హల్దవ్వానీకి చేరుకున్నా.. అక్డకి నుంచి మున్సియారికి రోడ్లు మూసివేయబడ్డాయని.. టాక్సీ డ్రైవర్లు అటు వచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఎగ్జామ్‌కు అటెండ్ కాకపోతే వన్ ఇయర్ వేస్ట్ అవుతుందని హెరిటేజ్ ఏవియేషన్ సీఈఓను సంప్రదించారు. ముప్పై నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నారు. సెంటర్‌కు వెళ్లేందుకు, మళ్లీ తిరిగొచ్చేందుకు ఒక్కొక్కరికి రూ. 10, 400 ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Next Story