- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. సోషల్ మీడియాలో లైవ్ విజువల్స్ వైరల్
భారత్‌లో నౌకాదళ విన్యాసాలు ముగించుకుని వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌక IRIS Denaను అమెరికా సబ్‌మెరైన్ టార్పెడోతో ముంచేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హిందూ మహాసముద్రం (Indian Ocean) ఒక్కసారిగా రణక్షేత్రంగా మారింది. శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఇరాన్ యుద్ధనౌక ‘ఐరిస్ డేనా’ (IRIS Dena)పై నిన్న తెల్లవారుజామున అమెరికా సబ్‌మరైన్(Submarine) మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యుద్ధనౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోగా ఇప్పటి వరకు 87 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే, ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను అమెరికా రక్షణ శాఖ (Pentagon) అధికారికంగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఫాస్ట్ అటాక్ సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించిన మార్క్ 48 (Mark 48) టార్పెడో నేరుగా ఐరిస్ డేనా నౌక వెనుక భాగాన్ని తాకడంతో భారీ పేలుడు సంభవించి నౌక రెండు ముక్కలైంది.
భారత్ నుంచి తిరిగి వెళ్తుండగా ఎటాక్..
ఇరాన్ నావికాదళానికి చెందిన అత్యంత ఆధునిక యుద్ధనౌక ‘ఐరిస్ డేనా’ ఇటీవల భారత్‌లోని విశాఖపట్నంలో జరిగిన ‘మిలన్ 2026’ అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొంది. ఈ విన్యాసాలు ముగించుకుని తిరిగి ఇరాన్ వెళ్తున్న సమయంలో శ్రీలంకలోని గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా దీనిని లక్ష్యంగా చేసుకుంది.






