గంజాయి స్మగ్లర్ ఇంట్లో డబ్బుల కట్టలు.. లెక్క పెట్టేందుకు అలసిపోయిన పోలీసులు(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-14 13:55:45  IST  )

యూపీలోని ప్రతాపగరంలో డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ఇంటిపై దాడి చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను జైలులో ఉండగా.. అతని భార్య రీనా మిశ్రా గ్యాంగ్ నాయకురాలిగా మారి కుటుంబ సహాయంతో నెట్ వర్క్ నడుపుతుంది. ఇందుకు

గంజాయి స్మగ్లర్ ఇంట్లో డబ్బుల కట్టలు.. లెక్క పెట్టేందుకు అలసిపోయిన పోలీసులు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీలోని ప్రతాపగరంలో డ్రగ్స్ స్మగ్లర్ రాజేశ్ మిశ్రా ఇంటిపై దాడి చేశారు పోలీసులు. ప్రస్తుతం అతను జైలులో ఉండగా.. అతని భార్య రీనా మిశ్రా గ్యాంగ్ నాయకురాలిగా మారి కుటుంబ సహాయంతో నెట్ వర్క్ నడుపుతుంది. ఇందుకు కొడుకు వినాయక్(19), కూతురు కోమలి(20), మేనల్లుళ్లు యశ్(19), అజిత్(31) సహకరిస్తున్నారు. ఈ విషయం నిర్ధారించుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ భారీ మొత్తంలో నోట్ల కట్టలు గుర్తించారు. 100, 50, 20 రూపాయల నోట్లు ఉండగా.. వీటిని లెక్కించేందుకు పూనుకున్నారు పోలీసులు. కానీ పెద్ద మొత్తంలో ఉండటంతో చెమటలు పట్టేశాయి. దీంతో నాలుగు నోట్ల లెక్కింపు మిషన్లు తెప్పించి లెక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంది. కాగా రైడ్‌లో 6.076 కేజీల గంజా, 577 గ్రాముల హెరాయిన్ గుర్తించారు. వీటి విలు సుమారు కోటి రూపాయలు ఉండగా.. లెక్కించిన డబ్బు రెండు కోట్ల రెండు లక్షలు అని తెలిపారు.

Next Story