- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాంఘై నగరంలో అనూహ్య ఘటన.. రోడ్డును మింగేసిన ‘సింక్ హోల్’
చైనాలోని షాంఘై నగరంలో చోటుచేసుకున్న ఓ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: చైనా (China)లోని షాంఘై (Shanghai) నగరంలో చోటుచేసుకున్న ఓ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. నగరంలోని ఓ ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి అదే చోట భారీ గొయ్యి (Sinkhole) ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. షాంఘైలోని ఓ బిజీ రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చూస్తుండగానే రోడ్డుపై పెద్ద రంధ్రం ఏర్పడి భూమిలోకి అకస్మాత్తుగా కలిసిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. భూగర్భంలో నీటి పైపులు లీక్ అవ్వడం వల్ల మట్టి కొట్టుకుపోవడం, సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా భూమి బలహీనపడి ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. మున్సిపల్ సిబ్బంది గొయ్యిని పూడ్చే పనులను వేగవంతం చేశారు. రోడ్డు అకస్మాత్తుగా మాయం అవుతున్న దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అవ్వడంతో నెటిజన్లు ఆ చిత్రం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






