- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
viral video: క్షమించండి అన్నా.. కనికరించని ప్రిన్సిపాల్! మూడో అంతస్తు నుంచి దూకిన బాలుడు
క్షమించండి అన్నా.. ప్రిన్సిపాల్ కనికరం చూపకపోవడంతో 8 వ తరగతి చుదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: క్షమించండి అన్నా.. ప్రిన్సిపాల్ కనికరం చూపకపోవడంతో 8 వ తరగతి చుదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్‌లో రత్లాంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్ రూమ్‌లో తను పదే పదే క్షమాపణలు చెబుతున్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో ఆరు పతకాలు గెలుచుకున్న ప్రతిభావంతుడైన విద్యార్థి, స్కూల్‌కు మొబైల్ ఫోన్ తీసుకెళ్లినందుకు ప్రిన్సిపాల్ చేసిన కఠిన వ్యాఖ్యలు, బెదిరింపుల తర్వాత మూడో అంతస్తు నుంచి దూకినట్లు తెలుస్తోంది.
స్కూల్ వర్గాల ప్రకారం, విద్యార్థి క్లాస్ రూమ్‌లో వీడియో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఘటనపై ప్రిన్సిపాల్ అతన్ని కార్యాలయానికి పిలిపించింది. ఈ చర్యపై ఆమె తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది.‘నీ కెరీర్‌ను ఖతం చేస్తా, నీ మెడల్స్ తీసేస్తా, నీపై సస్పెన్షన్ పెడతా’ ప్రిన్సిపాల్ అంటూ వ్యాఖ్యనించింది. ప్రిన్సిపాల్ కార్యాలయంలోని వీడియోలో బాలుడు నాలుగు నిమిషాల్లో 52 సార్లు ‘క్షమించండి’ అంటూ వేడుకుంటున్న వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఈ క్రమంలోనే బాలుడు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరగటం, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావటం వల్ల అతని స్కేటింగ్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థి తండ్రి ప్రీతమ్ కటారా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీడియో ఇదే..






