Viral News:అన్‌బిలివబుల్.. గాల్లోకి ఎగిరిన పక్షి పై దాడి చేసిన చిరుత(వీడియో వైరల్)

by Jakkula Mamatha |   ( Updated:2025-05-10 12:04:03.0  )
Viral News:అన్‌బిలివబుల్.. గాల్లోకి ఎగిరిన పక్షి పై దాడి చేసిన చిరుత(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో గమనించవచ్చు. కొందరు నెటిజన్లు ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన వెంటనే కెమెరాల్లో బంధిస్తారు. ఇక ఆ దృశ్యాలను కాస్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు చేసే వింత చేష్టలు చూస్తే భలే సరదాగా అనిపిస్తుంటుంది. ఇక జంతువుల దాడికి సంబంధించిన వీడియోలు మాత్రం ఆసక్తికరంగానూ, షాకింగ్ గానూ ఉంటాయి. అచ్చం అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అడవుల్లో ఎన్నో రకాల జంతువులు, పక్షులు నివాసం ఉంటాయి. ఇక అడవిలో ఉండే క్రూర మృగాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ జంతువుల దాడికి సంబంధించిన వీడియోలు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. చిరుత పులి దాడి చేస్తే ఎలా ఉంటుందో ఎన్నో వీడియోలలో చూసే ఉంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీడియో ప్రకారం.. పొడవైన గడ్డిలో పక్షుల గుంపు ఉంది. ఆ పక్షులు ఇతర జంతువుల దాడి నుంచి తమను తాము రక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉంటాయి. ఆ పక్షుల పేరు గినియాఫౌల్స్. ఈ పక్షులు ఎగరడంలో కూడా చాలా నైపుణ్యం కలిగి ఉంటాయి. కానీ ఈ పక్షులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ గడ్డిలో ఓ చిరుత దాగి ఉంది. అది ఎంతో ఆకలితో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎంతో ఆశగా ఆహారం కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో దానికి ఆ గినియాఫౌల్స్ పక్షుల గుంపు కనిపించింది. దీంతో వాటిని ఎలాగైనా తినాలని చిరుత భావిస్తోంది. ఈ నేపథ్యంలో చిరుత చాలా తెలివిగా పక్షుల గుంపు దగ్గరకు వెళ్తుంది. చిరుత రాకను పసిగట్టిన ఆ పక్షులు ఎగిరి పోవడానికి ప్రయత్నించాయి. కానీ ఆ చిరుత మెరుపు వేగంతో గాల్లోకి దూకి దాని నోట్లో ఒక పక్షిని పట్టుకుంటుంది. గాల్లోకి ఎగిరిన పక్షుల పై చిరుత దాడి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘చిరుత జంప్ నిజంగా అద్భుతంగా ఉంది’ అని ఒకరు, మరొకరు ‘అడవిలో జీవితం చాలా కష్టం. ప్రతి జంతువు మనుగడ కోసం కష్టపడాలి’ ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://youtu.be/MUb3upH4uPc?si=_G7UMHMJi7U5PWuY



Next Story

Most Viewed