భర్తలతో విసిగిపోయిన ఈ భార్యలు ఏం చేశారో చూడండి!

by Yella Dhawani Reddy |

మద్యానికి బానిసైన భర్తలు. రోజూ తాగొచ్చి తిడుతూ కొడుతూ చిత్రహింసలు పెట్టేవారు.

భర్తలతో విసిగిపోయిన ఈ భార్యలు ఏం చేశారో చూడండి!
X

దిశ, వెబ్ డెస్క్: మద్యానికి బానిసైన భర్తలు. రోజూ తాగొచ్చి తిడుతూ కొడుతూ చిత్రహింసలు పెట్టేవారు. దీంతో విసిగిపోయిన ఆ భార్యలు ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వింత పెళ్లి యూపీలోని గోరఖ్‌పుర్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

గోరఖ్‌పుర్‌కు చెందిన కవిత, గుంజా అలియాస్‌ బబ్లూ అనే మహిళలు ఇన్ స్టాగ్రామ్‌లో పరిచమయ్యారు. అయితే, ఇద్దరు మహిళలు దాదాపు ఒకే రకమైన సమస్యతో బాధపడుతుండటంతో ఒకరిపై ఒకరికి సానుభూతి, అభిమానం ఏర్పడ్డాయి. తాగుబోతు భర్తలతో ఇద్దరూ ఒకే విధమైన గృహ హింసను ఎదుర్కోవడం.. ఒకరి బాధ మరొకరు పంచుకుంటూ ఇద్దరూ దగ్గరయ్యారు. ఈక్రమంలో వారు ఓ నిర్ణయానికి వచ్చారు.

తమ భర్తలను వదిలేసి తామిద్దరం పెళ్లి చేసుకోవాలని కవిత, బబ్లూ నిర్ణయించుకున్నారు. అనంతరం ఈనెల 23న దేవరియాలోని శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఇందులో బబ్లూ పెళ్లికొడుకులా కవిత నుదుట తిలకం దిద్దింది. ఆపై ఇద్దరూ పూలదండలు మార్చుకుని ఏడడుగులు నడిచారు. దంపతులుగా మారిన కవిత, బబ్లూ ఇకపై గోరఖ్‌పూర్‌లోనే ఉంటామని, ఏదైనా పనిచేసుకుంటూ జీవిస్తామని చెప్పారు. కాగా, వీరి పెళ్లిపై శివాలయం పూజారి శంకర్‌పాండే స్పందిస్తూ.. మహిళలిద్దరూ పూలదండలు, సిందూరం తెచ్చి పూజలు చేసి వెళ్లిపోయారని తెలిపారు.

Next Story