Viral Video : హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. బరాత్.. రిసెప్షన్.. జోర్దార్..

by Sujitha Rachapalli |

అమ్మాయి, అబ్బాయి అట్రాక్ట్ కావడం.. ప్రేమ, పెళ్లి, శృంగారం అనేవి నేచురల్‌గా పరిగణించబడుతాయి. అది సృష్టి ధర్మంగా భావించబడుతుంది. అదే అమ్మాయి మరో అమ్మాయికి ఆకర్షించబడటం లేదా అబ్బాయి మరో అబ్బాయికి ఆకర్షించబడటం అనేది సృష్టికి విరుద్ధంగా ట్రీట్ చేయబడుతుంది.

Viral Video : హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. బరాత్.. రిసెప్షన్.. జోర్దార్..
X

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయి, అబ్బాయి అట్రాక్ట్ కావడం.. ప్రేమ, పెళ్లి, శృంగారం అనేవి నేచురల్‌గా పరిగణించబడుతాయి. అది సృష్టి ధర్మంగా భావించబడుతుంది. అదే అమ్మాయి మరో అమ్మాయికి ఆకర్షించబడటం లేదా అబ్బాయి మరో అబ్బాయికి ఆకర్షించబడటం అనేది సృష్టికి విరుద్ధంగా ట్రీట్ చేయబడుతుంది. ఇంతకు ముందు ఇలాంటి విషయాలు బయటకు చెప్పేందుకే భయపడేవారు. కానీ ఈ మధ్య లెస్బియన్ రిలేషన్స్, రైట్స్ గురించి మాట్లాడటం జరుగుతోంది. కొందరు ఒక్కటవుతున్నారు కూడా. పెద్దలు ఒప్పుకోకపోయినా తమ పార్టనర్‌తో ఉండేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలు మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దండలు మార్చుకుని.. సింధూర్ దిద్దుకుని.. బరాత్.. రిసెప్షన్.. అన్ని కార్యక్రమాలను గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పెళ్లిని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేశారు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సపోర్ట్ చేసేవారు ఎంత మంది ఉన్నారో అంతకు మించి విమర్శించే జనాలే ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడాన్ని తప్పు పడుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మంత్రాలు చదివేటప్పుడు కన్యను వరుడికి దానం చేయాలి. మంత్రాలు అలాగే రూపొందించబడ్డాయి. కానీ ఇక్కడ కన్య ఎవరు? వరుడు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విరుద్ధ పనులు చేసి సంప్రదాయాలకు మచ్చ తీసుకురాకూడదని సూచిస్తున్నారు. అయితే సపోర్టర్స్ మాత్రం మనుషుల సంతోషం కన్నా మంత్రాలు గొప్పవా అని ప్రశ్నిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అని అడుగుతున్నారు.

VIDEO

Next Story