జపాన్ టూరిస్టు వద్ద లంచం.. ఇద్దరు పోలీస్ పోలీసుల సస్పెండ్

by Ajay Maddhiboyina |

జపాన్ టూరిస్ట్ వ‌ద్ద లంచం తీసుకుని ఇద్ద‌రు పోలీసులు ఉద్యోగం నుండి స‌స్పెండ్ అయ్యారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటు చేసుకుంది. గురుగ్రామ్ లో బైక్ పై ఓ జ‌పాన్ టూరిస్టు వెళుతుండ‌గా అత‌డిని ఆపిన పోలీసులు వెన‌కాల కూర్చున్న వ్య‌క్తికి హెల్మెట్ లేద‌ని రూ.1000 ఫైన్ వేశారు.

జపాన్ టూరిస్టు వద్ద లంచం.. ఇద్దరు పోలీస్ పోలీసుల సస్పెండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: జపాన్ టూరిస్ట్ వ‌ద్ద లంచం తీసుకుని ఇద్ద‌రు పోలీసులు ఉద్యోగం నుండి స‌స్పెండ్ అయ్యారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో చోటు చేసుకుంది. గురుగ్రామ్ లో బైక్ పై ఓ జ‌పాన్ టూరిస్టు వెళుతుండ‌గా అత‌డిని ఆపిన పోలీసులు వెన‌కాల కూర్చున్న వ్య‌క్తికి హెల్మెట్ లేద‌ని రూ.1000 ఫైన్ వేశారు. అత‌డు కార్డ్ తో డ‌బ్బులు చెల్లిస్తాన‌ని చెప్ప‌గా, లేదు క్యాష్ ఇవ్వాల‌ని లేదంటే కోర్టులో క‌ట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.

అయితే ఆ టూరిస్ట్ హెల్మెంట్ కు కెమెరా ఉన్న విష‌యాన్ని మాత్రం గ‌మ‌నించ‌లేదు. దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ అవ్వ‌గా టూరిస్ట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. భార‌తీయుల ముఖాలు కాకుండా విదేశీయుల్లా క‌నిపిస్తే చాలు పోలీసులు అపేస్తారు అంటూ దీనికి క్యాప్ష‌న్ ఇచ్చాడు. వీడియో ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్ల‌డంతో ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేశారు. నెటిజ‌న్లు సైతం పోలీసుల తీరుపై మండిప‌డుతున్నారు. మీ క‌క్కుర్తితో దేశానికే చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. video

Next Story