ఇదెక్కడి వింత రా బాబు! అబ్బాయిలు వద్దంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-26 17:51:55  IST  )

ఆడ, మగ పెళ్లి చేసుకోవటం సర్వసాధారణం.

ఇదెక్కడి వింత రా బాబు! అబ్బాయిలు వద్దంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆడ, మగ పెళ్లి (Marriage) చేసుకోవటం సర్వసాధారణం. కానీ ఆధునిక నాగరికతలో ఇటీవల వింత వింత పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు అమ్మాయిలు వివాహబంధంతో ఒక్కటవ్వడం లాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ కోర్టు ప్రాంగణంలోని శివాలయం సాక్షిగా ఇద్దరు అమ్మాయిలు మంగళవారం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా స్నేహితులుగా ఉన్న ఇద్దరు యువతులు దండలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి అబ్బాయిలంటే ఇష్టం లేదని, అందుకే తామిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ముందుగా వారు.. ఓ న్యాయవాదిని కలిసి తమ వివాహానికి న్యాయపరమైన సాయం అందించాలని కోరారు. అయితే, స్వలింగ వివాహాన్ని చట్టం అంగీకరించదని న్యాయవాది వారికి స్పష్టం చేశారు.

కోర్టు అంగీకరించపోయినా, కుటుంబసభ్యులు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడానికి సమాజంలో అవకాశం కల్పించాలని కోరారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని న్యాయవాదిని వేడుకున్నారు. కాగా, తమ పట్ల పురుషులు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని, పురుషులంటే తమకు నచ్చదని గతంలో వారిద్దరు తన వద్దకు వచ్చారని లాయర్​ తెలిపారు.

Click For Video..

Next Story