రాష్ట్రంలో వింత పెళ్లి.. ఒక్కటైన విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలు

by Sujitha Rachapalli |

పశ్చిమ బెంగాల్‌లో వింత కథ వెలుగులోకి వచ్చింది. నార్మల్‌గా అమ్మాయి, అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. లేదంటే లెస్బియన్స్ అంటూ దగ్గరవుతారు.. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు విడాకులు తీసుకున్ని భర్తలను ఎక్స్‌లుగా

రాష్ట్రంలో వింత పెళ్లి.. ఒక్కటైన విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో వింత కథ వెలుగులోకి వచ్చింది. నార్మల్‌గా అమ్మాయి, అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. లేదంటే లెస్బియన్స్ అంటూ దగ్గరవుతారు.. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు విడాకులు తీసుకున్ని భర్తలను ఎక్స్‌లుగా మార్చేసిన ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. అవును.. మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో కలుసుకున్నఈ ఇద్దరు.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బీర్భూమ్‌లోని ఓ శివాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా కొందరు కంగ్రాట్స్ చెప్తున్నారు. శక్తి, సాంప్రదయాలను ధిక్కరించగల ధైర్యాన్ని పొగుడుతున్నారు. కానీ చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివే జరిగితే మనుషులు భూమి మీద బతకడం కష్టమంటున్నారు.

Next Story