- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lady Aghori : లేడీ అఘోరీ- శ్రీవర్షిణి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు
తెలుగు రాష్ట్రాల్లో హాల్ చల్ చేసిన లేడీ అఘోరీ(Lady Aghori) గురించి మన అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో హాల్ చల్ చేసిన లేడీ అఘోరీ(Lady Aghori) గురించి మన అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ ఏదోక విధంగా వార్తల్లో ఉండే లేడీ అఘోరీ.. శ్రీవర్షిణి(Aghori-Srivarshini) అనే యువతి కలిసి సహజీవనం సాగించడం మరింత సంచలనం రేపింది. లేడీ అఘోరీతోనే కలిసి బతుకుతానని వెళ్ళిన శ్రీహర్షిణి తల్లిదండ్రులు మాత్రం.. తమ కూతురును అఘోరీ తాంత్రిక విద్యల ద్వారా వశపరుచుకొని, ఎక్కడికో తీసుకుపోయిందని ఆరోపిస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో(Mangalagiri PS) ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వారు ఇరువురు గుజరాత్ లో ఉన్నట్టు తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గుజరాత్ పోలీసుల(Gujarath Police) సహాయంతో వారి అడ్రస్ ట్రేస్ చేశారు.
వివరాలు తెలసుకొని గుజరాత్ వెళ్ళగా.. తీరా కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు సదరు యువతి నిరాకరించింది. తనను వదిలివేయాలని, అఘోరీతోనే ఉంటానని వారిని బతిమాలింది. కుటుంబ సభ్యులు ఎంతో నచ్చజెప్పడంతో వారితో వెళ్లేందుకు ఒప్పుకుంది. ఆ తరువాత లేడీ అఘోరీ తనను బలవంతంగా తీసుకు వెళ్ళినట్టు, లైంగికంగా వేధించినట్టు పోలీసులకు తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై లేడీ అఘోరీ స్పందిస్తూ.. తనకూ శ్రీవర్షిణికి ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు ఏం జరిగినా నన్ను అడగొద్దు అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రీవర్షిణిని ఏపీ తీసుకువస్తున్నట్టు సమాచారం.






