నగర పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్.. బీజేపీ అభ్యర్థిగా బరిలో సోనియా గాంధీ

by Kema Shiva Kumar |

కేరళ (Kerala) రాష్ట్రం ఇడుక్కి జిల్లా మూన్నారు నగర పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

నగర పంచాయతీ ఎన్నికల్లో ట్విస్ట్.. బీజేపీ అభ్యర్థిగా బరిలో సోనియా గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ (Kerala) రాష్ట్రం ఇడుక్కి జిల్లా మూన్నారు నగర పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ (BJP) అభ్యర్థిగా ఓ వార్డు నుంచి ఏకంగా సోనియా గాంధీ (Sonia Gandhi) పోటీ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త, దివంగత దురైరాజ్, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీద ఉన్న గౌరవం, అభిమానంతో తనకు పుట్టిన అమ్మాయికి ‘సోనియా గాంధీ’ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ఆమె అత్యున్నత చదువులు చదివింది. అనంతరం ఇటీవల సుభాష్ అనే వ్యక్తికి ఆమెకు వివాహం జరిపించారు.

అయితే, సుభాష్ (Subhash) బీజేపీలో విద్యార్థి దశ నుంచే చురుకుగా పని చేస్తూ పంచాయతీ జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరించాడు. పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భర్త ప్రేరణతో సోనియా గాంధీ కూడా బీజేపీలో చేరి, ఇప్పుడు కమలం గుర్తుపై పోటీలో నిలిచింది. దీంతో అదే వార్డులో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మంజులా రమేష్‌ (Manjula Ramesh)తో పాటు ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోనియా గాంధీ పేరు చూసి ఓటర్లు గందరగోళానికి గురై, ఓట్లన్నీ బీజేపీకి వేస్తారేమోనని వారిలో ఓ భయం ఆవహించింది.

Next Story