టూ వీల‌ర్ బైక్ ఇలా కూడా పార్క్ చేస్తారా..? వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

తమిళనాడులో ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పైన చాలా వేగంగా వచ్చారట. వాళ్లు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.

టూ వీల‌ర్ బైక్ ఇలా కూడా పార్క్ చేస్తారా..? వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని వీడియోలు చాలా భయానకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో మరో వీడియో దర్శనమిచ్చింది. ఓ టూ వీలర్ వెహికల్ ను బీరువాలో దాచిపెట్టినట్లు.. ఓ కాలువలో భద్రంగా పెట్టారు. ఈ బైక్ ను కొంతమంది గ్రామస్తులు బయటకు తీస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో ఇటీవల కాలంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పైన చాలా వేగంగా వచ్చారట. వాళ్లు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టూవీలర్ అదుపు తప్పినట్లు సమాచారం. దీంతో అక్కడే ఉన్న చిన్న కాలువలోకి ఈ బైకు, దూసుకెళ్లిందట. ఈ ప్రమాద సంఘటనలో ఇద్దరు యువకులు మరణించినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ చిన్న కాల్వ నుంచి బైక్ ను బయటకు తీశారు. ఈ సందర్భంగా ఆ బైక్ హ్యాండిల్స్ మొత్తం బెండ్ అయ్యాయి. ఎవరో పార్క్ చేసినట్లుగానే కాలువలోకి బైకు దూసుకు వెళ్ళింది. ఈ వీడియో వైరల్ గా మారింది.







Next Story