Trending: రైఫిల్స్‌ను భుజాన వేసుకుని సాకర్ ఆడిన యువకులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-07 12:34:50  IST  )

రెండు తెగల మధ్య అంతర్గత కలహాలతో అట్టుడుకుతోన్న మణిపూర్‌ (Manipur)లో మరో ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కలిగిస్తోంది.

Trending: రైఫిల్స్‌ను భుజాన వేసుకుని సాకర్ ఆడిన యువకులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెగల మధ్య అంతర్గత కలహాలతో అట్టుడుకుతోన్న మణిపూర్‌ (Manipur)లో మరో ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. జనవరి 20న మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ (Imphal) నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న గామ్నోంఫై గ్రామంలో 12 మంది యువకులు ఎకె-47 (AK-47)తో సహా ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్స్‌ను చేతబట్టి యథేచ్ఛగా ఫుట్‌బాల్ ఆడారు. అయితే, అందుకు సంబంధించిన వీడియోను కాంగ్‌పోక్పి (Kongpokpi) జిల్లాకు చెందిన నంపి రోమియో హాన్‌సాంగ్ (Nampi Romeo Hansong) అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిన వేళ ఆ వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, వీడియో యువకులు ఆకుపచ్చ టీషర్ట్, బ్లాక్ షార్ట్స్ వేసుకుని గన్స్ ప్రదర్శిస్తూ ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఆటగాళ్లందరి జెర్సీలపై ‘సనాఖాంగ్’ అని రాసి ఉంది.

కాగా, ఆ వీడియో చూసిన Meitei హెరిటేజ్ సొసైటీ ‘X’ (ట్విట్టర్)లో అధికారులను హెచ్చరిస్తూ సంచలన పోస్ట్ చేసింది. ‘మణిపూర్‌ (Manipur)లో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ (Football tournament) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుట్‌బాల్ క్రీడాకారులుగా పిలవబడే వారు అధునాతన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడం కలవరపెట్టే విషయం. ఇది సాధారణ టోర్నమెంటా.. లేక కుకీ మిలిటెంట్ల (Kuki Militants) ఫుట్‌బాల్ టోర్నమెంటా’. యువకులు బహిరంగంగా గన్స్ పట్టుకుని ఫుట్‌బాల్ ఆడటంపై వెంటనే విచారణ జరిపించాలని మేము అధికారులను కోరుతున్నాం’ అంటూ Meiteai హెరిటేజ్ సొసైటీ ట్వీట్ చేసింది.

Next Story