Trending: వారెవ్వా అరచేతిలో ఖైరతాబాద్ బడా గణేష్.. నెట్టింట్లో వీడియో వైరల్

by Kema Shiva Kumar |

వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో ఖైరతాబాద్ మహా గణపతికి ఉన్న క్రేజే వేరు.

Trending: వారెవ్వా అరచేతిలో ఖైరతాబాద్ బడా గణేష్.. నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో ఖైరతాబాద్ మహా గణపతికి ఉన్న క్రేజే వేరు. ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’‌గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే, విఘ్ననాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామి వారి సమక్షంలో కుటుంబ సమేతంగా ఫొటోలు దిగుతూ.. యువత సోషల్ మీడియా (Social Media)లో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ (Khairtabad) మహా గణపతిని స్ఫూర్తిగా తీసుకుని మాసబ్ ట్యాంక్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాల (Fine Arts College)లో మూడో సంవత్సరం చదువుతోన్న విద్యార్థి సంపత్ (Sampath) అద్భుతం సృష్టించాడు. ఏకంగా ఖైరతాబాద్ గణనాథుడి భారీ విగ్రహం తరహాలో కేవలం 5.5 సెంమీ. పరిమాణంలో చాక్‌పీఎస్‌పై అచ్చం అలాంటి విగ్రహాన్ని చెక్కి అబ్బురపరుస్తున్నాడు. అయితే, విద్యార్థి సంపత్ ఖైరతాబాద్ బడా గణేష్ సూక్ష్మ విగ్రహాన్ని తయారు చేసేందుకు 32 గంటల పాటు శ్రమించాడట. ప్రస్తుతం బడా గణేష్.. చోట రూపం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి: https://x.com/ChotaNewsApp/status/1963103762559771107

Next Story