- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: తెరుచుకోని ట్రైన్ డోర్లు.. ఏసీ కోచ్ గ్లాస్‌ను ధ్వంసం చేసిన ప్రయాణికులు (వీడియో వైరల్)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో కొనసాగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)కు భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో కొనసాగుతోన్న మహా కుంభమేళా (Maha Kumbhmela)కు భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కుంభమేళా మొదలై 28 రోజులు గడస్తున్నా.. ఇప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం సుమారు 1.42 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు వెళ్లే రోడ్డు మార్గాలు అన్ని వాహనాలతో నిండిపోయాయి. సుమారు 200 కి.మీ నుంచి 300 కి.మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దీంతో భక్తులు ఆ ట్రాఫిలో చిక్కు్క్కుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక అన్ని రాష్ట్రాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు వచ్చే భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ (Indian Railways) స్పెషల్ ట్రైన్ల (Special Trains)ను వేసింది. కానీ, భక్తులు తాకిడికి రైళ్లన్నీ కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఈ పరిణామంతో ముందే టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీహార్ (Bihar)లోని మధుబని రైల్వేస్టేషన్ (Madhubani Railway Station)లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ (Swatantra Senani Express)పై ప్రయాణికులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రైలులో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేకపోవడంతో అధికారులు డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఏసీ కోచ్ (AC Coach) విండో గ్లాస్ పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్‌గా అవుతోంది.






