Trending: ఇదెక్కడి ఇచ్ఛంత్రం ముచ్చట.. పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు (వీడియో వైరల్)

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-28 17:43:21  IST  )

కాదేది.. దొంగతనానికి అనర్హం అన్నట్లుగా తయారైంది ఈ రోజుల్లో దొంగల పరిస్థితి.

Trending: ఇదెక్కడి ఇచ్ఛంత్రం ముచ్చట.. పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: కాదేది.. దొంగతనానికి అనర్హం అన్నట్లుగా తయారైంది ఈ రోజుల్లో దొంగల పరిస్థితి. ఏది దోరికితే.. అది అమాంతం ఎత్తుకెళ్తున్న పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని మూసారాంబాగ్ (Moosarambagh) ఈస్ట్ ప్రశాంత్ నగర్‌ (East Prashant Nagar)లో చెప్పుల దొంగలు బీభత్సం సృష్టించారు. మైక్రో హెల్త్ అపార్ట్‌మెంట్‌తో సహా ఏక కాలంలో నాలుగు అపార్ట్‌మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు, చెప్పులను ఎత్తుకెళ్లారు. ఉదయం బయటకు వచ్చి చూసిన ఆయా అపార్ట్‌మెంట్ వాసులు బూట్లు, చెప్పులు కనబడకపోవడంతో కంగారు పడ్డారు. అయితే, సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీ‌ (CCTV footage)ని పరిశీలించగా.. తమ చెప్పులు, బూట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. కొస మెరుపు ఏంటంటే బాధితుల్లో పోలీస్ ఇన్‌స్పెక్టర్, మహిళా ఎస్ఐ కూడా ఉన్నారు.

Click For Video..

Next Story