- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రన్ అయ్యే థియేటర్ సీజ్.. అసలు విషయం ఇదే!
హీరో రామ్ చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: హీరో రామ్ చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. అన్ని థియేటర్లలో డివైడ్ టాక్‌తో మూవీ దూసుకెళ్తూ.. మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం నంద్యాల (Nandyal) జిల్లా బనగానపల్లె (Banaganapally)లో విచిత్రం చోటుచేసుకుంది. పట్టణంలోని జీఎం ప్యాలెస్ (GM Palace)లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రన్ అవుతుండగానే అధికారులు థియేటర్‌ను సీజ్ చేశారు. అకస్మాత్తుగా సినిమాను నిలిపివేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్ యాజమాన్యం, సీజ్ చేసిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే, ఎలాంటి లైసెన్స్ లేకుండానే జీఎం ప్యాలెస్ యాజమాన్యం మూవీని రన్ చేస్తున్నందుకు తాము థియటర్‌ను సీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీంతో చేసేది ఏమి లేక రామ్ చరణ్ అభిమానులు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు.






