Trending: యువతి ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్‌.. ఆ తరువాత ఏం జరిగిందంటే? (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2025-02-12 03:21:19.0  )
Trending: యువతి ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్‌.. ఆ తరువాత ఏం జరిగిందంటే? (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్ (Mobile Phone).. ఈ రోజుల్లో బడికెళ్లే బుడ్డొడి నుంచి పండు ముసలి వరకు వయసు సంబంధం లేకుండా విపరీతంగా వాడేస్తున్నారు. మొబైల్ లేనిదే రోజు గడవదు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) అందుబాటులోకి రావడంతో క్యాష్ పేమెంట్స్ (Cash Payments) పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆన్‌లైన్ పేమెంట్స్ (Online Payments) చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వెంట మొబైల్ ఫోన్ (Mobile Phone) తీసుకెళ్లడం తప్పనిసరైంది. అయితే, స్మార్ట్​ఫోన్​(Smart Phone) వినియోగం వల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మొబైల్ అతి వినియోగంతో బ్యాటరీ (Battery) వేడెక్కి.. ఫోన్లు అకస్మాత్తుగా పేలిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం.

ఈ క్రమంలోనే బ్రెజిల్ (Brazil) దేశంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఓ యువతి సూపర్ మార్కెట్‌ (Super Market)కు వెళ్లింది. వస్తువులు కొనుగోలు చేస్తుండగా.. ఆమె బ్యాక్ ప్యాకెట్‌ (Back Pocket)లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ పేలుడులో మహిళ వెనుక భాగంతో పాటు, చేతులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే, మొబైల్ ఫోన్ (Mobile Phone) పేలిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story