- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! నగరంలో కేసీఆర్, కేటీఆర్‌లపై హోర్డింగ్స్ హల్‌చల్
దావోస్ (Davos) వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అండ్ టీమ్ రాష్ట్రానికి రూ.1,78,950 కోట్ల రికార్డు పెట్టుబడులను తీసుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దావోస్ (Davos) వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అండ్ టీమ్ రాష్ట్రానికి రూ.1,78,950 కోట్ల రికార్డు పెట్టుబడులను తీసుకొచ్చింది. గతేడాది దావోస్ పర్యటన (Davos Tour)లో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈ సారి నాలుగు రెట్లకు మించి వచ్చాయి. మొత్తం 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు (MOU)లు చేసుకుంది. ఐటీ (IT), ఏఐ (AI), ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ (Congress) నేతలు ఓ వినూత్న ప్రాచారానికి తెర లేపారు. నగర వ్యాప్తంగా కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)లను ఉద్దేశించి ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేశారు. పెట్టుబడులు చూసి కడుపు మంటా..? వాడండి ENO..!, #DigestTheGrowth ట్యాగ్‌లైన్‌తో పెట్టిన హోర్డింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లో హల్‌చల్ చేస్తున్నాయ్. అయితే, ఆ బ్యానర్లను జనం తమ వాహనాలను పక్కకు ఆపి ఆసక్తిగా తిలకిస్తుండటం విశేషం.






