ట్రెండింగ్ లో పసుపు రీల్.. మ్యాజిక్ తర్వాత.. అసలు విషయం తెలిస్తే చచ్చినా ట్రై చేయరు

by Naga Rani Yarlagadda |

ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, సీసపు గాజులో నీటితో పాటు పసుపు వేసే రీల్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చీకటిలో మొబైల్ లైట్ వెలుతురులో.. ఈ ప్రక్రియను అందంగా చూపిస్తూ వీడియోలు చేస్తున్నారు.

ట్రెండింగ్ లో పసుపు రీల్.. మ్యాజిక్ తర్వాత.. అసలు విషయం తెలిస్తే చచ్చినా ట్రై చేయరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, సీసపు గాజులో నీటితో పాటు పసుపు వేసే రీల్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చీకటిలో మొబైల్ లైట్ వెలుతురులో.. ఈ ప్రక్రియను అందంగా చూపిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కి యువత పెద్ద ఎత్తున ఆకర్షితమవుతున్నారు. అందరూ చేస్తుండడంతో మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో మరికొందరు అనుకరిస్తున్నారు. కానీ ఇదే ట్రెండ్‌పై జ్యోతిష్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

వీరి అభిప్రాయం ప్రకారం.. నీటిలో పసుపు కలిపే ప్రక్రియ ఒక సాధారణమైన రసాయన చర్య కాదట. ఇది పలు మాయాజాలాల్లో, శాస్త్రీయేతర ప్రక్రియలలో ఉపయోగించే ఒక భాగమని చెబుతున్నారు. ఇంట్లో ఇలా చేయడం వలన ప్రతికూల శక్తులు ఆహ్వానించబడే అవకాశం ఉందని, ఇది ఇంటి వాతావరణాన్ని, మానసిక స్థితిని చెడగొట్టే అవకాశముందన్నారు.

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. ఈ రీల్‌లు చేయడం వలన జన్మ జాతకంలోని చంద్రుడు, బృహస్పతి వంటి గ్రహాల శక్తి బలహీనపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. దీని ప్రభావం మానసిక స్థితిపై, ఆర్థిక పరిస్థితులపై కూడా పడవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ రీల్ చేయడం వలన కొందరికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించే అవకాశముందని, ఇది దెయ్యాలు, ఆత్మల వంటి శక్తుల ప్రభావాన్ని తీసుకురావచ్చని అంటున్నారు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్ కాదు. దీని వెనుక నమ్మకాలు, మతపరమైన శాస్త్రాలు ఉన్నాయని వారి అభిప్రాయం.

గమనిక : పైన చెప్పిన అంశాలు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం మాత్రమే. వీటిని దిశ ధృవీకరించదు.

Next Story