Trending: ప్రభుత్వ పాఠశాలలో అమానుషం.. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్

by Shiva |
Trending: ప్రభుత్వ పాఠశాలలో అమానుషం.. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులను గాడిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోతున్నారు. చిన్న విషయాలకే విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడుతూ గురు, శిష్యుల బంధానికి మాయనిమచ్చ తెస్తున్నారు. అచ్చం అలాంటి ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా దుబ్బ (Dubba) ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అశ్విత (Ashwitha) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే. ఇటీవలే అశ్విత పాఠశాల ముగిసే సమయం కంటే ఓ గంట ముందుగానే ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లిన అశ్వితపై ఆగ్రహించిన క్లాస్ టీచర్ ఆమెపై విచక్షణా రహితంగా కొట్టింది. ఈక్రమంలో అశ్విత (Ashwitha) కుడి చేయి విరిగింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యా్ర్థిని చావబాదిన ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story