- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : అర్ధరాత్రి భారీ వర్షం.. క్లౌడ్ బరస్ట్!
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, ఆర్‌సి పురం, కూకట్‌పల్లి, మణికొండ, ఖాజాగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్ దాదాపు 2 గంటల సేపు భారీ వర్షం కురిసింది. అయితే ఆయా ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా ఆగకుండా తెల్లవార్లూ కురుస్తూనే ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు శంషాబాద్, రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్, సరూర్ నగర్, చంద్రాయణగుట్ట వైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. రాత్రి 2 గంటల తర్వాత పెద్ద వర్షం తగ్గి, ఉదయం దాకా ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
క్లౌడ్ బరస్ట్.. హఠాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం!
శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూర్, చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్ ప్రాంతాల ప్రజలను అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ లాంటి భయంకరమైన ఉరుముల తుఫాను విరుచుకుపడుతుందని, లోతట్టు ప్రాంతాల్లోకి హఠాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
10 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ
హైదరాబాద్‌తో పాటు రాబోయే రెండు గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. బయట పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అత్యవసర సహాయక బృందాలు విజ్ఞప్తి చేశాయి.






