స్టోక్స్, అట్కిన్సన్‌లకు భారీ ఊరట.. నైట్ క్లబ్ ఘటనలో నిర్దోషులుగా తేల్చిన ఈసీబీ

by Harish |

స్టోక్స్, అట్కిన్సన్‌లకు భారీ ఊరట.. నైట్ క్లబ్ ఘటనలో నిర్దోషులుగా తేల్చిన ఈసీబీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, బౌలర్ అట్కిన్సన్‌లకు భారీ ఊరట లభించింది. నైట్ క్లబ్ ఘటనలో వారి తప్పు లేదని స్వతంత్ర సంస్థ క్రికెట్ రెగ్యులేటర్ సోమవారం వెల్లడించింది. వారిద్దరిపై ఎలాంటి చర్యలు ఉండవని తెలిపింది. అలాగే, ఆ ఘటనపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చేపట్టిన విచారణలోనూ వారు నిర్దోషులు అని తేలింది. ఆ ఘటన సమయంలో స్టోక్స్ అక్కడ లేడని, అట్కిన్స్‌పై దాడి జరిగినా అతను ప్రతిస్పందించలేదని ఈసీబీ విచారణలో వెల్లడైంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లగా.. అక్కడ సరస్సెన్స్ రగ్బీ యూనియన్ ప్లేయర్ టోటోవా ఔవాతో ఘర్షణ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ ఘర్షణ‌లో ఇంగ్లాండ్ భద్రతా సిబ్బందిలో ఒక్కరికి గాయమైనట్టు తెలిసింది. ఈ ఘటన తర్వాత ఈసీబీ స్టోక్స్, అట్కిన్సన్‌లను రెండో టెస్టు నుంచి తప్పించింది. అయితే, వీరిద్దరూ మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నారు. ఆదివారం ప్రకటించిన జట్టులో వీరిద్దరికి చోటు దక్కింది.


Next Story