హైదరాబాద్ మెట్రోకు రుణం.. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సానుకూల చర్చలు!

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ మెట్రోకు రుణం.. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సానుకూల చర్చలు!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో జరిపిన భేటీలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలు చర్చకు వఛ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుండి రుణ సహాయం కోరగా.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అత్యంత సానుకూలంగా స్పందించారని, మెట్రో విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరుల సమకూర్పుపై కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అంశంపై మంగళవారం ఉదయం కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో మౌలిక వసతుల కల్పనపై కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చించి, ప్రాజెక్టుకు అవసరమైన తుది అనుమతులు, నిధుల విడుదలను వేగవంతం చేయడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

Next Story