- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సివిల్ సప్లై ఆఫీసులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు
by Batti.Sumithra |
ప్రభుత్వ ధాన్యం అక్రమ తరలింపు కేసులో నిందితుడైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సోమవారం తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్ ధాన్యం సేకరణ పూర్తి చేయగా, ధాన్యం అక్రమ తరలింపు కేసులో జిల్లా పౌరసరఫరాల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కే.రాజ శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వ ధాన్యం అక్రమ తరలింపు కేసులో నిందితుడైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సోమవారం తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాసంగి సీజన్ ధాన్యం సేకరణ పూర్తి చేయగా, ధాన్యం అక్రమ తరలింపు కేసులో జిల్లా పౌరసరఫరాల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కే.రాజ శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ ను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ధాన్యం అక్రమ తరలింపు పై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ను జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశించారు. విచారణ నివేదిక రాగానే.. తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Next Story






