UIDAI: ఆధార్‌లో ఇ-మెయిల్ అప్‌డేట్‌కు యూఐడీఏఐ ప్రత్యేక ఆఫర్

by S Gopi |

ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఇ-మెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేయడానికి ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 75 రుసుమును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటనలో తెలిపింది.

UIDAI: ఆధార్‌లో ఇ-మెయిల్ అప్‌డేట్‌కు యూఐడీఏఐ ప్రత్యేక ఆఫర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆధార్ యూజర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఇ-మెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేయడానికి ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 75 రుసుమును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈ రుసుమును ఆరు నెలల పాటు పూర్తిగా మినహాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. అయితే, ఈ సదుపాయం కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్‌డేట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. యూఐడీఏఐ ఇటీవల ప్రారంభించిన ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మొబైల్ నంబర్, చిరునామా అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, ఇ-ఆధార్ డౌన్‌లోడ్, అథెంటికేషన్ హిస్టరీ చెక్ వంటి పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇ-మెయిల్ ఐడీని ఆధార్‌తో లింక్ చేసుకోవడం వల్ల యూజర్లు ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్డేట్‌లను నేరుగా పొందే అవకాశం ఉంటుంది. డిజిటల్ సేవల వినియోగాన్ని ప్రోత్సహించడం, మరింత ఎక్కువ మంది యూజర్లను ఆధార్ యాప్ వైపు ఆకర్షించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత ఈ రుసుము మినహాయింపును కొనసాగించాలా లేదా తిరిగి అమలు చేయాలా అనే విషయంపై యూఐడీఏఐ సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Next Story