- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG20 league : తిలక్ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఒంటిచెత్తో మెదక్‌ను గెలిపించిన స్టార్ బ్యాటర్
టీజీ20 లీగ్‌లో భారత స్టార్ బ్యాటర్, మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ రెచ్చిపోయాడు.

దిశ, స్పోర్ట్స్ : టీజీ20 లీగ్‌లో భారత స్టార్ బ్యాటర్, మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ తిలక్ వర్మ రెచ్చిపోయాడు. వరంగల్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారీ సెంచరీ బాది తన జట్టును గెలిపించాడు. తిలక్ అసాధారణ ప్రదర్శన చేయడంతో మెదక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వరంగల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ఆ జట్టులో అమన్ రావు పేరాల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 142 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అతని మెరుపులతో వరంగల్.. మెదక్ ముందు 259 పరుగుల భారీ లక్ష్యం పెట్టింది.
అయితే, చేజింగ్‌లో తిలక్ చెలరేగిపోయాడు. ఆదివారం తిలక్ కెప్టెన్సీలో భారత ‘ఏ’ జట్టు ట్రై సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయమే హైదరాబాద్‌కు చేరుకున్న అతను అనూహ్యంగా ఈ గేములో పాల్గొన్నాడు. ఇతర బ్యాటర్లు నిరాశపర్చిన వేళ కెప్టెన్‌గా భారాన్ని అంతా మీదేసుకున్నాడు. కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. జట్టును గెలిపించాలని పంతంతో ఆడాడు. చివరి వరకూ అజేయంగా నిలిచిన తిలక్ 56 బంతుల్లో 136 పరుగులు చేసి మరో రెండుబంతులు మిగిలి ఉండగానే మెదక్‌ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ సంచలన పోరాటం చేయడంతో వరంగల్ భారీ స్కోరు చేసినా నిరాశ తప్పలేదు.
సోమవారం జరిగిన మరో మ్యాచ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్‌పై రంగారెడ్డి రైజర్స్ విజయం సాధించింది. మొదట నల్గొండ 189/8 స్కోరు చేయగా.. 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి అలవోకగా ఛేదించింది. 16.3 వర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. తనయ్ త్యాగరాజ్(71 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి రంగారెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించాడు.






