- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖతార్ గ్యాస్ పోర్టులో పేలుడు.. మృతుల్లో భారీగా భారతీయులు
ఖతార్ గ్యాస్ పోర్టులో సోమవారం భారీ పేలుడు సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఖతార్ గ్యాస్ పోర్టులో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి మృతి చెందిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. అంతర్జాతీయ ఇంధన రంగానికి గుండెకాయ వంటి ఖతార్‌లోని రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ (Ras Laffan) పరిధిలోని ప్రధాన గ్యాస్ ఎగుమతి పోర్టులో సోమవారం అకస్మాత్తుగా భారీ పేలుడు జరిగింది. ఈ ఘోర ప్రమాద సమయంలో టెర్మినల్ వద్ద విధుల్లో ఉన్న కార్మికులలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో 12 మంది భారతీయ పౌరులే ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. ఈ భారీ పేలుడు ధాటికి గ్యాస్ లోడింగ్ విభాగానికి చెందిన ప్లాంట్ తీవ్రంగా ధ్వంసమవడమే కాకుండా మరో 54 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఖతార్ అత్యవసర రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురాగా, గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం హెలికాప్టర్లు, ప్రత్యేక అంబులెన్సుల ద్వారా దోహాలోని మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం గ్యాస్ పైప్‌లైన్ వాల్వ్ వద్ద ఏర్పడిన తీవ్ర సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
రంగంలోకి భారత రాయబార కార్యాలయం
మృతుల్లో అత్యధికులు భారతీయులే కావడంతో ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వెంటనే స్పందించింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తోంది. గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు, మరణించిన వారి భౌతికకాయాలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ దౌత్యపరమైన చర్యలు ప్రారంభించింది.






