పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

by Batti.Sumithra |

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది.

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
X

దిశ, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం వట్టిమర్తి గ్రామానికి చెందిన సంకబుడ్డి నాగరాజు యాదవ్ (35) గొర్రెలను మేపుతూ గ్రామ శివారులో ఉన్నాడు. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈ క్రమంలో సమీపంలో పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి అతడే ప్రధాన ఆధారం. గొర్రెల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్న నాగరాజు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story