- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లో బాణాసంచా పేలుడు.. భయంతో వణికిపోయిన అభిమానులు
థియేటర్లో అభిమానులు చేసిన ఆకతాయి పనికి ప్రేక్షకులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : థియేటర్లో అభిమానులు చేసిన ఆకతాయి పనికి ప్రేక్షకులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమన్నారు. మహారాష్ట్రలోని మలేగావ్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 'మోహన్ సినిమా' థియేటర్‌లో బాణాసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. థియేటర్‌లో ఓ వైపు సినిమా ప్రదర్శిస్తుండగానే, కొందరు అభిమానులు హాల్ లోపలే ఒక్కసారిగా బాణసంచా కాల్చారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులు దీనిని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ వీడియో ఆధారంగా ఈ ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, అసలు థియేటర్ లోపలికి టపాసులు ఎలా వచ్చాయనే విషయంపై విచారించేందుకు పోలీసులు థియేటర్ యజమానికి కూడా నోటీసులు జారీ చేసి, విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.






