- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ : మెస్సీ విశ్వరూపం.. దూసుకుపోతున్న అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. టెక్సాస్‌లోని డాలస్ స్టేడియంలో జరిగిన గ్రూప్-జే హోరాహోరీ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రియాపై అద్భుత విజయం సాధించింది. అర్జెంటీనా సాధించిన ఈ రెండు గోల్స్‌ను కూడా ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఒంటి చేత్తో అందించడం విశేషం.
క్లోస్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర
ఈ మ్యాచ్‌లో మెస్సి కేవలం జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మెస్సి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ 38వ నిమిషంలో మెస్సి కొట్టిన అద్భుతమైన గోల్‌తో.. ఇప్పటివరకు జర్మనీ దిగ్గజ ఆటగాడు మిరోస్లావ్ క్లోస్ (16 గోల్స్) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఆ తర్వాత మ్యాచ్ గమనాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న మెస్సి, అర్జెంటీనా తరఫున మరో గోల్ కూడా సాధించి జట్టు విజయాన్ని ఖాయం చేయడంతో పాటు తన మొత్తం వరల్డ్‌కప్ గోల్స్ సంఖ్యను 18కి చేర్చాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా టోర్నమెంట్‌లో మరోసారి హాట్ ఫేవరెట్‌గా దూసుకుపోతోంది.






