- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిఫా వరల్డ్ కప్ : ఎంబాపె మెరుపులు.. ఫ్రాన్స్ చేతిలో ఇరాక్ చిత్తు
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ జట్టు మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ జట్టు మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు స్టార్ స్ట్రైకర్ క్యిలియన్ ఎంబాపె అద్భుతమైన ఆట తీరుతో మెరిపించడంతో, ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 గోల్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఎంబాపె ఈ మ్యాచ్‌ను ఒంటిచేత్తో ఫ్రాన్స్ వైపు తిప్పేశాడు. ఫ్రాన్స్ జట్టు మ్యాచ్ మొదటి నుంచే ఇరాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట 14వ నిమిషంలోనే ఎంబాపె ఫ్రాన్స్‌కు మొదటి గోల్ అందించగా, ఆ తర్వాత 54వ నిమిషంలో మరో అద్భుత గోల్ వేసి జట్టును తిరుగులేని స్థితికి చేర్చాడు. ఆ వెంటనే 66వ నిమిషంలో ఊస్మాన్ డెంబెలే కూడా ఒక గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ 3-0తో సులభ విజయాన్ని అందుకుంది.
వర్షం పడినా తగ్గని జోరు
ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వాతావరణం అనుకూలించలేదు. భారీ వర్షం కారణంగా దాదాపు 2 గంటల పాటు మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే వాతావరణం శాంతించిన తర్వాత మైదానంలోకి దిగిన ఫ్రాన్స్ ఆటగాళ్లు ఏమాత్రం పట్టు కోల్పోకుండా, మరింత పుంజుకుని ఇరాక్‌కు అస్సలు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు.
పాయింట్ల పట్టికలో టాప్
ఈ విజయంతో ఫ్రాన్స్ జట్టు ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి, మొత్తం 6 పాయింట్లతో గ్రూప్ స్టేజ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్టార్ ప్లేయర్ ఎంబాపె ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 16 గోల్స్ వేసి బెస్ట్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు.






