- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడ్వాయిలో అర్ధరాత్రి ఆపరేషన్.. బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్
యూరియా యాప్‌ను రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునిచ్చిన వంటా-వార్పు ధర్నా.. మండలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, తాడ్వాయి: మండల కేంద్రం ఒక్కసారిగా రణరంగాన్ని తలపిస్తోంది. యూరియా యాప్‌ను రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు పిలుపునిచ్చిన వంటా-వార్పు ధర్నా.. మండలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు జరిపిన మెరుపు అరెస్టులతో తాడ్వాయి ఒక్కసారిగా హైటెన్షన్ జోన్‌గా మారిపోయింది.
నిద్ర లేవకముందే ఖాకీల పహారా
ధర్నా పిలుపుతో అలర్ట్ అయిన పోలీసులు.. తెల్లవారకముందే వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా,నిద్రలో ఉండగానే తలుపులు తట్టి ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. అందులో కొందరిని అరెస్టు చేసి థర్డ్ వై పోలీస్ స్టేషన్ తరలించారు.
అండర్‌గ్రౌండ్‌లోకి ముఖ్య నేతలు?
అరెస్ట్ అయిన వారు కాకుండా, నిరసనను నడిపించగల మరికొంతమంది కీలక నేతల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. నాయకులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి ఉంటారనే అనుమానంతో ప్రత్యేక నిఘా పెట్టారు. మండల సరిహద్దులు, ధర్నా చౌక్ వైపు వచ్చే ప్రతీ వాహనాన్ని చెక్ చేస్తున్నారు.
తాడ్వాయిలో ఏం జరగబోతోంది?
ఎక్కడికక్కడ పోలీసులు మోహరించడం, మరోవైపు అరెస్టులకు దొరకకుండా నిరసనను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు వ్యూహాలు రచిస్తుండటంతో.. తాడ్వాయి మండలంలో ఏం జరగబోతోందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. పోలీసుల వ్యూహం ఫలిస్తుందా? లేక ఆంక్షలను చేధించుకుని గులాబీ శ్రేణులు వంటా-వార్పుకు దిగుతాయా అనేది చూడాలి.






