మళ్లీ తెరపైకి "ఏకశిల" వివాదం.. అడ్మిషన్లపై గందరగోళం

by Naga Rani Yarlagadda |

హయత్‌నగర్ మండల పరిధిలో వివాదాస్పదంగా మారిన ‘ఏకశిల’ స్కూల్ వ్యవహారం మరో సారి చర్చనీయాంశంగా మారింది.

మళ్లీ తెరపైకి ఏకశిల వివాదం.. అడ్మిషన్లపై గందరగోళం
X

దిశ, వనస్థలిపురం: హయత్‌నగర్ మండల పరిధిలో వివాదాస్పదంగా మారిన ‘ఏకశిల’ స్కూల్ వ్యవహారం మరో సారి చర్చనీయాంశంగా మారింది. పాఠశాల పేరు మార్పు, అనుమతులు, అడ్మిషన్ల ప్రక్రియపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ మండల విద్యాధికారి (ఎంఈవో) శ్రీనివాస్ స్పందన విమర్శలకు దారితీస్తోంది. ‘పేరు మార్పు కోసం దరఖాస్తు చేశారు.. ఫైలు ఆర్జేడీ వద్ద పెండింగ్‌లో ఉంది.. త్వరలోనే అనుమతి వస్తుంది’ అంటూ ఆయన చెప్పడం, మరోవైపు స్కూల్ కార్యకలాపాలు ‘ఏకశిల అడ్వాన్స్​డ్​ లెర్నింగ్​ స్కూల్​’ పేరుతో సాగుతున్నాయనే తల్లిదండ్రులు చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ని బంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి యాజమాన్యానికి అనుకూలంగా మామూళ్ల మత్తులో మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రెండేళ్లుగా పేరు మార్పు వివాదం.. ఎంఈవో మౌనం ఎందుకు?

రెండేళ్లుగా ప్రియదర్శిని కాలనీలో అ నుమతి పొందిన ‘సెయింట్ జోసెఫ్ హై స్కూల్’ పేరుతో ఉన్న విద్యాసంస్థను ఏకశిల గ్రూప్​ ఆఫ్​ ఇనిస్టిట్యూష న్​ యాజమాన్యం.. రెండేళ్లుగా వేర్వేరు పేర్లు మార్చుతూ, బోర్డులు ప్రదర్శి స్తూ.. సీబీఎస్​ఈ కరిక్యులమ్​ అంటూ ఫీజులు డబుల్​ చేస్తూ.. విద్యాశాఖ ని బంధనలను తుంగలో తొక్కుతోంది. ఈ అకడమిక్​ ఇయర్​ మరో అడుగు ముందుకేసి ‘ఏకశిల అడ్వాన్స్‌డ్ లె ర్నింగ్ స్కూల్’గా ప్రచారం చేసుకుం టూ.. పర్మిషన్​ వచ్చిందంటూ అబద్దపు ప్రచారం చేస్తూ అమాయకులను బురి డీ కొట్టిస్తూ అడ్మిషన్లు తీసుకుంటోం ది. ఇంత జరుగుతున్నా.. బోర్డులు, యూనిఫాంలు, పుస్తకాలు, మొబైల్ యాప్‌లు, బస్సులు అన్నీ ‘ఏకశిల’ పేరుతో ఉండగా, అధికారికంగా మా త్రం ‘సెయింట్ జోసెఫ్’ పేరుతోనే అ డ్మిషన్లు తీసుకుంటున్నారు’ అంటూ ఎంఈవో శ్రీనివాస్​ యాజమాన్యానికి వత్తాసు పలకడంతో వివాదానికి దారితీస్తోంది. రెండు అకడమిక్​ ఇయర్స్​ నుంచి ఈ వ్యవహారం కొనసాగుతు న్నా, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. ఎంఈవో చర్యలు తీసుకోకపోవడంపై ఎంఈవో చేతివాటంతోనే చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఎంఈవో వ్యాఖ్యలపై విమర్శలు

పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకో రు? అంటూ ప్రశ్నిస్తే.. ‘ అది అంత ఈజీ కాదు.. దానికి ప్రక్రియ ఉంటుం ది’ అని ఎంఈవో సమాధానం ఇవ్వ డం తీవ్ర చర్చకు దారితీసింది. ‘వాళ్లు పుస్తకాలు అమ్ముకోవచ్చు, యూని ఫాంలు వాడుకోవచ్చు, బస్సులు నడ పొచ్చు’ అని ఎంఈవో చెప్తుండడంపై ఆయన వైఖరిపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన ప్రతి సారీ “చూస్తాం”, “యాజమాన్యంతో మాట్లాడతాం” అనే సమాధానాలతో సరిపెట్టడం వెనుక కారణాలేమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

డీఈవో జోక్యానికి డిమాండ్

పిల్లలను ‘ఏకశిల’ పేరుతోనే చేర్పించామని, అదే పేరుతో ప్రచారం జరగడంతో అనుమతులు కూడా ఉన్నా యని భావించామని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు అ ధికారిక గుర్తింపు ఏ పేరుకు ఉందనే అనుమానంతో తమ పిల్లల భవిష్యత్​పై ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాధికారి (డీఈవో) స్వయంగా జోక్యం చేసుకుని పాఠశాల అనుమతులు, పేరు మార్పు, అడ్మిషన్ల ప్రక్రియపై స మగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని విద్యావేత్తలు, వి ద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ని బంధనల ఉల్లంఘన తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, విద్యా ర్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను పరిరక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎంఈవో తీరు అనుమానాస్పదమే..

ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఎంఈవో.. 8 నుంచి 10వ తరగతి వరకు, ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలను తనిఖీ చేయాలి. అందులో గుర్తిం పు లేని విద్యాసంస్థలపై డీఈవోకు నివేదికను అందజేయాలి. అయితే ఈ ప్ర క్రియ హయత్​నగర్​ మండలంలో అ మలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్కన అబ్దుల్లాపూర్​ మెట్​ ఎంఈవో అనుమతిలేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయో.. నోటీస్​ బోర్డులో ప్ర దర్శించారు. కానీ హయత్​నగర్​ ఎం ఈవో శ్రీనివాస్​ ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటే ఆయన ప్రైవేట్​ యాజమాన్యాలతో ఏమేరకు లాలూచీ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జూన్‌లో అనుమతి లేని పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సి ఉండ గా.. ఆయన అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి న తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో స్పం దిస్తుంటారన్న విమర్శలు ఉన్నాయి.

చర్యలు తీసుకోవడం అంత ఈజీ కాదు..

­ ‘ఆ స్కూల్​ ను పరిశీలించాం. బోర్డులు ‘ఏకశిల అడ్వాన్స్​డ్​ లెర్నింగ్​ స్కూల్’గానే పెట్టారు. కానీ సెయింట్​ జోసెఫ్​ హై స్కూల్​ పేరుమీదనే అడ్మిషన్లు తీసుకున్నామని చెప్పా రు. పేరు మార్పిడి పర్మిషన్​కు అప్లై చేసుకున్నారు. ఆ ఫైల్​ ఆర్​జేడీ వద్ద పెండింగ్​లో ఉంది. రెండు మూడు రోజుల్లో పర్మిషన్​ వస్తుందని చెప్పారు. వాళ్లు బుక్స్, యూనిఫామ్స్, అమ్మితే అమ్మొచ్చు. ఏకశిల బస్సులు నడిపితే నడుపొచ్చు. అయితే మీకేంటి బాధ.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్​? వారిపై చర్యలు తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. దానికి చా లా ప్రాసెస్​ ఉంటుంది.’

- శ్రీనివాస్​, ఎంఈవో, హయత్​నగర్​

Next Story